దళితులు అంత ఏకం కావాలి
కొండ్రు విజయ్
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్ లోని ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ. దళితులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పయనించాలని అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా వర్గీకరణ బిల్లును బిజెపి ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతుందని, ఇప్పటికైనా అందరూ ఏకతాటిగా ఉండి రాజ్యాధికారం కోసం పాటుపడాలని ఆయన అన్నారు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. బిజెపి ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాలా మాదిగలను విడదీసే ప్రయత్నం మానుకోవాలని, ఇప్పటికైనా మాలలు మేల్కొని ఒక తాటిపై నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాయన్న చిన్న, నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు కొటే వెంకట్రావు, ఉపాధ్యక్షులు కొమ్మ తోటి సుధాకర్, యూత్ అధ్యక్షులు కనమాల అంకారావు, గౌరవ సలహాదారుడు కొమ్మ తోటి కృపయా, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, నూజెండ్ల మండల అధ్యక్షులు కందుకూరి గురుమూర్తి, శావల్య పురం మండల మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, వినుకొండ మండల ఉపాధ్యక్షులు చలమాల రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి పిడతల రాజా, అంబడపూడి శ్రీను, పల్లపాటి భాస్కర్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : దళితులు అంత ఏకం కావాలి)