కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు
ఘన నివాళులు
న్యూస్ తెలుగు /వినుకొండ : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా నరసరావుపేట రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ ఇంచర్జ్ బొయపాటి రామాంజనేయులు, రెడ్డి బోయిన ప్రసన్న కుమార్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో రాజ్యాంగం వ్రాయటానికి సహకరించారని తెలిపారు. ఆలాగే రామాంజనేయాలు మాట్లాడుతూ. ఎస్ సి, ఎస్ టీ, ముస్లిం మైనార్టీ మరియు బి సి సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారని, ప్రతి ఒక్కరు స్మరించుకోవలసిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమము లో పిడుగు విజయ్, కందుల దేవ, ఆడపాల శ్రీను, అనిల్, బాషా, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు. (Story : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు)