సంస్కరణలకు ఆద్యుడు అంబేద్కర్
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని జనసేన నేత గురాన అయ్యలు కొనియాడారు.అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం తన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వారి ఆశయాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి వల్లే దేశానికి గొప్ప రాజ్యాంగం సమకూరిందన్నారు. అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జనసైనికులు పి.రవీంద్ర,ఎంటి రాజేష్ , మేడేపల్లి పవన్ కుమార్ , అడబాల వెంకటేష్ నాయుడు,పృథ్వీ భార్గవ్,నానీ,అభిలాష్ , సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : సంస్కరణలకు ఆద్యుడు అంబేద్కర్)