పశు, పాడి రైతులను ఆర్థిక అభివృద్ధితో ముందుకు తీసుకువెళతాం
డాక్టర్ పారా లక్ష్మయ్య
న్యూస్ తెలుగు /వినుకొండ : పశు,పాడి గొర్రెలు, మేకలు పోషక రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని నూతనంగా నియమితులైన ఏ.పి వెటర్నరీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పారా లక్ష్మయ్య అన్నారు. బుధవారం ఎమ్మెల్యే జీవి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు అయిన కార్యక్రమంలో డాక్టర్ పారా లక్ష్మయ్య ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు డాక్టర్ పారాల లక్ష్మయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పారా మాట్లాడుతూ. ఈ ప్రాంతం వాడినైన తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ వెటర్నరీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్గా అందుకు సహకరించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు , ప్రభుత్వ చీప్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు , మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పారా మాట్లాడుతూ. వెటర్నరీ డాక్టర్ గా అనుభవం ఉన్న తనకు చాలా పెద్ద బాధ్యతను పెట్టారని, పూర్తిస్థాయిలో తమ బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం త్వరలో వన్ హెల్త్ పాలసీ ముందుకు తీసుకు వస్తున్నది అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పశువులు జంతువులు పలు రోగాల బారిన పడి మృత్యువాత పడి ఆయా రైతులు నష్టపోతున్నారని అన్నారు. పశువులు, జంతువులు వ్యాధుల నిర్ధారణకు వ్యాధులు నివారించేందుకు త్వరలో గన్నవరంలో 100 కోట్లతో యానిమల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ పారా తెలిపారు. అలాగే జంతు మాంసాలు విక్రయ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో ప్రత్యేక పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేసి. రోగాల బారిన పడి ఆ మాంసం విక్రయాలను నియంత్రిస్తామని డాక్టర్ పారా తెలిపారు. (Story : పశు, పాడి రైతులను ఆర్థిక అభివృద్ధితో ముందుకు తీసుకువెళతాం)