డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు
న్యూస్ తెలుగు/సాలూరు : కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ సూపర్ సీక్స్ పథకాలు ప్రజలకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజన్న దొర అన్నారు బుధవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్ పథకాలుఅమలు చేస్తామని సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ నెరవేర్చలేదు కదా ప్రజలకి రోజు రోజుకి నిత్యవసర వస్తువులు ధరలు విద్యుత్ చార్జీలు. టోల్ టాక్సలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీ లెగ్గొట్టి సంపద సృష్టించడం ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నించారు . జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలు అందరూ సంతోషంగా ఉండే వారిని ప్రతి నెల బ్యాంకుల చుట్టూ ఏదో ఒక ప్రభుత్వ పథకం విడుదల చేయడంతో బ్యాంకు లు కలకలలాడేయని ఆ విధంగా వ్యాపారస్తులుకు కూడా మంచి వ్యాపారం జరిగేదిని అన్నారు. ప్రజలను ఇచ్చిన హామీలను డైవర్ట్ చేస్తూ జగన్ మీద లేనిపోని ఆరోపణ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు తక్కువ ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్ కోసం సుమారు 19 లక్షల కుటుంబాలకు 2846 వేలకోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఇవ్వడం జరిగిందని అన్నారు . అధికారంలోకి వచ్చిన వెంటనే 50 సంవత్సరాల బీసీ ఎస్సీలు కు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానం తుంగలో తొక్కరిని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేక చాలామంది కాలేజీ విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలోనే ప్రజా సమస్యలు తెలుసుకున్నందుకు పార్లమెంట్ స్థాయిలో సంక్రాతి అయిన తర్వాత ప్రజల ముందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ. సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు జేఏసీ కన్వీనర్ గిరి రఘు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.(Story : డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ సూపర్ సీక్స్ పథకాలు )