UA-35385725-1 UA-35385725-1

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ రేవల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు, తల్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రం, ను ఆకస్మికంగా సందర్శించారు. కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోనే స్టాక్ ను దించుకోవాలని సూచించారు. వంట సామాగ్రి కి సంబంధించిన వస్తువులు ఎక్స్పెరి డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్ళీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. తల్పునూరు జెడ్పి పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తలుపులు, కిటికీలు, గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జెడ్పి సీఈవో యాదయ్య, డిపిఆర్ఓ సీతారాం, రేవల్లి తహసిల్దార్ లక్ష్మీదేవి, ఎంపీడీవో నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు సిబ్బంది, తదితరులు ఉన్నారు.(Story : విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1