Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశాఖ ఉక్కుప్రైవేటీకరణ వ‌ద్దు

విశాఖ ఉక్కుప్రైవేటీకరణ వ‌ద్దు

విశాఖ ఉక్కుప్రైవేటీకరణ వ‌ద్దు

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌.డి.కుమారస్వామిని కలిసి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం వినతిపత్రం అందజేసింది.  కుమారస్వామిని  వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ పి.వి.మిధున్‌ రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మద్దిల గురుమూర్తి, మేడా రఘునాధ్‌ రెడ్డి, గుమ్మ తనూజా రాణి కలిసి వినతిపత్రం అందజేజేశారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారిందని తద్వారా లాభదాయకతను ప్రభావితం చేస్తుందని కేంద్రమంత్రికి తెలిపారు. విశాఖ ఉక్కు టర్న్‌ అరౌండ్‌ సాధించడానికి అవసరమైన చేయూత కేంద్రం అందించాలని వినతిపత్రంలో కోరిన ఎంపీలు, మరో రెండేళ్ళపాటు కేంద్రం నుంచి చేయూత అందితే ఆర్ధిక పరిస్ధితి మెరుగువుతుందన్నారు. ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించడానికి వీలుగా ఆర్‌ఐఎన్‌ల్ కు క్యాప్టివ్‌ మైన్‌లను కేటాయించడం ద్వారా వ్యయప్రతికూలతలను అధిగమించేందుకు సహాయపడుతుందని, కేంద్ర సహకారం అందిస్తే ప్లాంట్‌ మళ్ళీ లాభదాయకమైన వెంచర్‌గా మారుతుందని , ఆర్ధిక పునర్నిర్మాణానికి కేంద్రం సాయపడాలని విజ్ఞప్తి చేశారు, తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్న వైఎస్సార్సీపీ ఎంపీల బృందం, వచ్చే కేబినెట్ లో ఈ ప్రతిపాదనలు పెడతానని హామీ ఇచ్చార‌న్నారు. (Story : విశాఖ ఉక్కుప్రైవేటీకరణ వ‌ద్దు)

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!