లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహన
న్యూస్‌తెలుగు/ తిరుపతి : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహిళా అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్. డి ఉమాదేవి పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2013 పై అవగాహన కార్యక్రమాన్ని హ్యుమానిటీస్ బ్లాక్ సెమినార్ హాల్ నందు 02-12-2024 వ తేదీన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2013 యొక్క ప్రధాన లక్షణాలను, శిక్షాస్మృతులను గురించి వివరించారు. మహిళలను మాటలు, ప్రవర్తన,సైగలు, చేష్టలుద్వారా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఆఫీసులో, పాఠశాలలో, వివిధ ప్రదేశాలలో లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూస్తున్నాయని ఇలాంటి చర్యలకు చట్టం కఠినమైన శిక్షలు విదోస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర ప్రాజెక్టు అసిస్టెంట్ డాక్టర్. ఎం.ఇంద్రాణి,ఇతర సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. (Story : లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహన )