ఆదర్శ పట్టణంగా వినుకొండ
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణం ను బహిరంగ మలమూత్ర విసర్జిత రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని, పరిశుభ్రత విషయంలో రాజీలేని కృషి చేయాలని వినుకొండ పట్టణం ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జి వి ఆంజనేయులు పిలుపుమేరకు మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజలను ఉద్దేశించి ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, నీటి వనరులు లేదా వ్యవసాయ క్షేత్రాలలో మలవిసర్జన చేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని. నిర్దేశించిన పబ్లిక్ టాయిలెట్లలో తప్ప, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం కూడా నిషేధించబడిందని దీనికి విరుద్ధంగా బహిరంగ మలవిసర్జన లేదా బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడిన వ్యక్తులకు ఐదు వందల రూపాయలు వరకు జరిమానా విధించెదమని కమీషనర్ హెచ్చరించారు. ఓడిఎఫ్, ఓడిఎఫ్+ ఓడిఎఫ్ ++ మునిసిపాలిటీలకు అవార్డులు గుర్తింపులు పొందుటయే గాక పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గ్రాంట్లు మరియు నిధుల కోసం మునిసిపాలిటీలు అర్హుత సాధించునని తెలిపారు. ఓడిఎఫ్ నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించడానికి పురపాలక అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారని .పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి పౌరులకు అవగాహన కల్పించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహిస్తామని కమీషనర్ తెలిపారు. (Story : ఆదర్శ పట్టణంగా వినుకొండ)