సాయాన్ని బాధ్యతగా అందిస్తోన్న కూటమి ప్రభుత్వం
న్యూస్‌తెలుగు/వినుకొండ : ప్రజల అవసరంలో, ఆపదలో సాయాన్ని కూడా బాధ్యతగా అందిస్తోన్న ప్రభుత్వం తమది మాత్రమే అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. దరఖాస్తు రావడమే ఆలస్యంగా సకాలంలో అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం చంద్రబాబు నిజమైన అర్థం చెబుతున్నారన్నారు. వినుకొండ మండలం ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా పద్మకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని ఆదివారం జీవీ ఆంజనేయులు అందజేశారు. వినుకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భర్త ముసలయ్యకు సంబంధిత రూ.61 వేల చెక్కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని ప్రతిక్షణం వారి మేలు కోసం ఉపయోగిస్తున్న కూటమి ప్రభుత్వంలో తానూ భాగస్వామిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంచి చేస్తున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ప్రజ ల ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. (Story : సాయాన్ని బాధ్యతగా అందిస్తోన్న కూటమి ప్రభుత్వం)