గురుకుల హాస్టల్ ని తనిఖీ
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం పరిధిలోని ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే ( చిట్యాల) గురుకుల హాస్టల్ ని తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది విద్యార్థులు చెబుతూ మాకు పురుగుల అన్నం రాళ్ల అన్నం, నీళ్ల చారు టేస్టీ లేని కర్రీస్ అపరిశుభ్రమైన పరిసరాలు మరియు వర్కర్స్ కొరత విద్యార్థులకు రూమ్ల కొరత వలన విద్యార్థులకు క్లాస్ రూమ్ పడకగదిగా మారింది అదేవిధంగా స్థానికంగా అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అదే విధంగా విద్యార్థుల యొక్క కాస్మోటిక్ చార్జీలు(ఆరు నెలలుగా) రావడం లేదు , అదేవిధంగా చలికాలం వచ్చిన విద్యార్థులకు స్వెటర్లు దుప్పట్లు ఇంతవరకు అందించలేదు అదేవిధంగా మెనూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు, అధికారులు కొత్త మెనూ ఇంప్లిమెంటేషన్ లేదు అంతేకాకుండా అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు బిఆర్ఎస్వి నాయకులతో ఏడుస్తూ సమస్యలు చెబుతుంటే అక్రమంగా పోలీసులు వచ్చి విద్యార్థి నాయకులను బెదిరించడం కేసులు పెడతారని విద్యార్థి నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బిఆర్ఎస్వి నాయకులు మాత్రం విద్యార్థుల యొక్క బాగే మా ఎజెండా,అని పోలీసులతో వాగ్వాడని దిగడం జరిగింది అనంతరం విద్యార్థులకు ఏ సమస్య ఉన్న ఈ హెల్ప్ లైన్ 8522044336, నెంబర్ కు సంప్రదించండి బిఆర్ఎస్వి నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఇన్చార్జిలుగా గట్టు శివ యాదవ్ ,హేమంత్ , లక్ష్మణ్ గౌడ్, శివ ప్రసాద్ గౌడ్ సూర్య రెడ్డి , అఖిలేందర్, విశాల్, అజిత్ షరీఫ్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.(Story : గురుకుల హాస్టల్ ని తనిఖీ)