అన్నదాతలకు అధైర్యం వద్దు
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలందరూ యాసంగి పంటకు కావలసిన తుకాలను పోసుకోవచ్చునని, పంటకు కావలసిన సాగునీరును యధాతధంగా అందిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీటిపారుదల సమీక్ష సమావేశంలో యాసంగి నీటి విడుదల పై రాష్ట్ర నీటి పారుదల శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారనీ. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా యాసంగి సీజన్ ఆసాంతం సాగునీరు అందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదిలో పుష్కలంగా నీరునందున సాగునీటి విడుదలకు ఎలాంటి ఆటంకం లేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు .వ్యవసాయపరమైన, సాగునీటిపరమైన ఏవైనా సమస్యలు ఉన్న రైతులు నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నదాతలకు సూచించారు.(Story : అన్నదాతలకు అధైర్యం వద్దు)