ఏడాది కాంగ్రెస్ పాలనలోసామాన్య ప్రజలు ఇబ్బందులు హైకోర్టున్యాయవాదిమద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఏడాది కాంగ్రెస్ పాలనలో, ప్రజలు రక రకాలుగా ఇబందులకు గురవుతున్నారు, ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలకుచ్చిన హామీలు అమలు చేయడం మరచి, గత ప్రభుత్వ బాటలోనే పిరాయింపులకు పెద్దపెట వేసి, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది అని వికసిత తెలంగాణ కన్వీనర్ హై కోర్ట్ అడ్వకేట్ మధి రాల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. ఒక వైపు మూసి ప్రక్షాళన పేరుతొ, మరో వైపు హైడ్రా పేరు తో పేదల ఇండ్లను నోటీసు లేకుండా కూల్చడం, రాజంగం ఉల్లoగణ కాదా అని అన్నారు.లాగచర్ల లో బలవంతంగా రైతుల భూములు లాక్కొనే ప్రయత్నం చేయడం, ప్రజాస్వామ్యం అనిపించుకోదు, చేసిన తప్పిద్దాలు కప్పిపుచ్చు కోవడానికి, నాయకులపై, రైతుల పై కేసులు పెట్టడం, విషయాన్ని పక్కదారి పట్టించడం, కాంగ్రెస్ కె చెల్లింది, బి ర్ స్ బాటలోనే కాంగ్రెస్ నీతులు వళ్లిస్తూ, ప్రజలను మోసం చేస్తున్న విషయం, కాలం నిర్ణయిస్తుంది, రాబోయే రోజులలో కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ది చెపుతారుఅని అన్నారు. ప్రజలలో, బీఆర్ఎస్ పార్టీ లాగే కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందిఅని మధి రాల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.(Story : ఏడాది కాంగ్రెస్ పాలనలోసామాన్య ప్రజలు ఇబ్బందులు హైకోర్టున్యాయవాదిమద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డి)