గంగినేని ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థికి
ఆర్థిక సహాయం
న్యూస్ తెలుగు /వినుకొండ :వినుకొండ పట్టణానికి చ చెందిన షేక్ కాశీం షా సాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థికి చదువులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో పట్టణంలోని టిడిపి నాయకుల సహకారంతో బుధవారం వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విద్యార్థికి గంగినేని ఫౌండేషన్ అధినేత గంగినేని రాఘవ మాస్టారు ద్వారా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని విద్యార్థినీకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. గంగినేని ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థినికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గంగినేని ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగిందని, ఈ విద్యార్థికి మూడు సంవత్సరాలు స్కాలర్షిప్ గా అందిస్తున్నామన్నారు. గంగినేని ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేదవారికి ఎన్నో రకాలుగా సహాయ సహాకారాలు అందిస్తున్న గంగినేని ఫౌండేషన్ అధినేత రాఘవ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంవి ఆంజనేయులు, టిడిపి నాయకులు షమీంఖాన్,ఆయుబ్ ఖాన్ ,పివి సురేష్ బాబు, సౌదాగర్ జానీ భాష, చికెన్ బాబు ,అజీజు, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. (Story : గంగినేని ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థికి ఆర్థిక సహాయం)