పెండింగ్ పనుల అనుమతులపై అటవీశాఖ అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే ల ప్రత్యేక భేటీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : సానుకూలంగా స్పందించిన అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డోబ్రియల్ వనపర్తి నియోజకవర్గ పరిధిలో గతంలో చేపట్టిన పనులకు సంబంధించి పలు సమస్యల కారణంగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులపై మంగళవారం ఎంపీ మల్లు రవి , ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంబంధిత అటవీశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డోబ్రియల్ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు వనపర్తి నుంచి బైపాస్ రోడ్ రాజపేట తాండ వరకు ( కొత్తకోట -ఆత్మకూరు రోడ్డుకు అనుసంధానం).వనపర్తి పాలకేంద్ర నుంచి అంజనగిరి వరకు బైపాస్ రోడ్డ.(కొల్లాపూర్ రోడ్డుకు అనుసంధానం).గాను సర్వేనెంబర్ 55,v 56 నుంచి 17.139 “హెక్టార్లను” కేటాయిస్తూ రావాల్సిన ప్రభుత్వ అనుమతులపై స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించి సర్వేనెంబర్ 86 నుంచి 12 ఎకరాల 8 గుంటలు అదేవిధంగా సర్వేనెంబర్ 25 నుంచి 12 గుంటల భూమిని సేకరణపై అంజనిగిరి తాండకు బీటీ రోడ్డు కోసం సర్వేనెంబర్ 6 నుంచి 0.69 హెక్టార్ల సేకరణ గురించి చెరువు ముందరి తండా వయా పెద్దతండ నుంచి బుద్వా నాయక్ తండ వరకు సర్వే నెంబర్ 455 నుంచి 0.87హెక్టార్ల కేటాయింపు పై కాన్ చెరువు కెనాల్ కోసం 45 సర్వే నెంబర్ నుంచి 2.13 గుంటల భూమి (500 MTS కెనాల్ పొడవు) కేటాయింపు కోసం వనపర్తి మునిసిపాలిటీలోని 8వ వార్డు శ్రీనివాసపురంకు స్మశాన వాటిక కోసం సర్వేనెంబర్ 55లో ఎకరం భూమి సేకరణ కోసం హాకీ స్టేడియం నిర్మాణం కోసం సర్వే నెంబర్ 56 లో ఐదు ఎకరాలను కేటాయింపు సమస్యలపై వెంటనే ప్రభుత్వం అనుమతులు జారీ చేయాలని వారు కోరినట్లు పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయిలో అనుమతులు అందుతాయని అనుమతులు అందిన వెంటనే పనులు మొదలవుతాయని ఎంపీ, ఎమ్మెల్యే లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వనపర్తి అటవి శాఖ జిల్లా అధికారి రామాంజనేయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : పెండింగ్ పనుల అనుమతులపై అటవీశాఖ అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యే ల ప్రత్యేక భేటీ)