ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి ఆర్టీసీడిపో ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిపో మేనేజర్ గారికి కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండ్ల రాజు పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ 2019 డిసెంబర్ లో గత ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగిందని ఆంక్షలు ఎత్తివేయాలని ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాల భాగస్వామ్యం కల్పించాలని సామాజిక భద్ర పథకాలైన PF, SRBS, SBT, ట్రస్టులకు కార్మిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలని కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని పనిగంటలు తగ్గించాలని ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు అర్ధరాత్రి వరకు డ్యూటీలు చేయిస్తున్నారని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యూనియన్ కార్యకలాపాలకు అనుమతిస్తామని ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని గత ప్రభుత్వ విధానాలనే ఈ ప్రభుత్వం అవలంబిస్తుందని వారు విమర్శించారు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అనేది పాలకుల బిక్ష కాదని దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కని ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఉందని ఈ హక్కును పాలకవర్గాలు అరించివే స్తున్నాయని కార్మికుల గొంతు నొక్కడం అత్యంత దుర్మార్గమని ఆలోచనలు వెనక్కి తీసుకొని ఆర్టీసీ కార్మిక హక్కులను కాపాడాలని వారు కోరారు లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికుల తరఫున సిఐటియు పోరాటాలను నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ కే సునీత సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏ బుచ్చమ్మ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర ఆచారి సిఐటియు సీనియర్ నాయకులు డి కురుమయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల నాయకులు జి బాలస్వామి రాములు నాగరాజు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంధం గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి)