UA-35385725-1 UA-35385725-1

కేసీఆర్ స్పూర్తితో వస్తున్న ‘కేశవ చంద్ర రమావత్’ 

కేసీఆర్ స్పూర్తితో వస్తున్న ‘కేశవ చంద్ర రమావత్’ 

న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా : రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్), గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘కేశవ చంద్ర రమావత్’ ఈనెల 22న  రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాడ్ గా నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. నాకు సినిమాలతో పరిచయం తక్కువ. సినిమా వేడుకలకి వెళ్ళడం అరుదు. రాకేశ్ గురించి తెలుసుకున్న తర్వాత వేడుకకు రావాలనిపించింది. రాకేశ్ కి ఆశీర్వదించడం కోసం ఈ వేడుకకు వచ్చాను. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఒకొక్క మెట్టు ఎదుగుతూ రాకింగ్ రాకేశ్ గా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులందరి ప్రేమని పొందాడు. రాకేశ్, కేసీఆర్ గారి స్ఫూర్తితో అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. రాష్ట్రం సాధించడమే కాదు రాష్ట్రాన్ని పదేళ్ళు అద్భుతమైన ప్రగతి పధంలో నడిపిన నాయకుడు కేసీఆర్. వారి కృషిని పోరాటాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం రాకేశ్ చేశాడు. జనరల్ గా పవర్ లో వుండే పార్టీకి సినిమా తీస్తారు.  కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీయడం రాకేశ్ లోని నిజమైన ప్రేమ, ధైర్యం. అందరూ ఈ సినిమా చూసి రాకేశ్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’అన్నారు.

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ వేడుక ఒక దూంధాంలా వుంది. రాకేశ్ సుజాత శ్రమించి తీశారు కనుక ఈ సినిమా జబర్దస్త్, జోర్దార్ లా వుంటుంది. తమ్ముడు ఒకొక్కమెట్టు ఎదుగుతూ వచ్చాడు. రాకేశ్ జీవితంలో స్కిట్స్ వున్నాయి. ఇకపై హిట్స్ వుండాలని కోరుకుంటున్నాను. చాలా పాషన్ తో ఈ సినిమా తీశాడు. ఒక తపస్సులా సినిమా తీశాడు. తన నిజాయితీని ప్రేక్షకులు గుర్తిస్తారని నమ్ముతున్నాను. తెలంగాణ మట్టి నుంచి పుట్టిన కథ ఇది. తప్పకుండా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’ అన్నారు.

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..ఈ వేడుక చూస్తుంటే చాలా రోజుల తర్వాత మమ్మల్ని మేము చూస్తున్నట్లు వుంది. అందరినీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నట్లుగా వుంది. అంత సంతోషాన్ని కలిగించిన తమ్ముడు రాకేశ్ కి అభినందనలు. రాకేశ్ చాలా ధైర్యం చేసి ఈ సినిమా చేశాడు. నచ్చిన నాయకుడిని వెదుకుంటు నగరానికి వచ్చిన యువకుడి కథ ఇది. ఈ ప్రయత్నం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. రాకేష్ నాకు జబర్దస్త్ లో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటూ చిన్న పిల్లల్లాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. కెసిఆర్ అంటే మా రాకేష్ కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయడంతోపాటు తెలంగాణపై తనకున్న ప్రేమని ఈ సినిమాలో చూపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను.బలగం సినిమాలనే ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. తన సంపాదించిన ప్రతి రూపాయిని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు. తన ఇంటిని కూడా త్యాగం చేశాడు. రాకేష్ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేస్తూ ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ.. కెసిఆర్ స్ఫూర్తితో ఈ సినిమా తీయడం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇది చిన్న సినిమా కాదు గొప్ప సినిమా. చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రాకేష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. గుండెల నిండా అభిమానం ప్రదర్శించే నటన కౌశలంతో పాటు ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతను కూడా తీసుకున్నాడు. ట్రైలర్లో ప్రేమ కథ హాస్యం సందేశం అన్నీ కనిపిస్తున్నాయి. ఈ సినిమాని మనమందరం మంచి  మనసుతో ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు

నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు గారి పెళ్లి సందడి లా ఉంది ఈ సినిమా సందడి. అందరూ ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడుకోవడమే సినిమా వేడుక. రాకేష్ మా బ్యానర్ లో యాక్ట్ చేశాడు. అలాగే అనన్య కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా మా బ్యానర్ లో పరిచయం చేసాం. అనన్య కృష్ణ నటన చూస్తే మహానటి సావిత్రి గుర్తుకొచ్చింది. ఇలాంటి సినిమాలు మంచి ఫలితాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి ఆణిముత్యాలు లాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే పెద్ద పిక్చర్లు అంత పెరుగుతుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు

గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. రాకేష్ కి మంచి సబ్జెక్ట్ ఉంది. ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో చాలా మంచి పాట రాశాను.  రాకేష్ మంచితనం కారణంగానే ఈరోజు ఇంతమంది వేడుకకు వచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఆడుతుంది. రాకేష్ లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఈ సినిమా అందరూ చూసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు

జానీ మాస్టర్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. ఈ సినిమా వందశాతం సక్సెస్ అనిపిస్తోంది. రాకేశ్ చాలా మంచి వ్యక్తి. అందరూ బావుండాలని కోరుకునే వ్యక్తి. ఇక్కడ అందరూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన వ్యక్తులే. భర్తకు భార్య దీవెన ఖచ్చితంగా వుంటుంది. జీవితంలో ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంటుంది. అలాగే సుజాత రాకేశ్ వెనుక నిలబడ్డారు. మీ కష్టానికి తగిన ఫలితం వుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

యాక్టర్ సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ…రాకేశ్ ది ఇన్స్పిరేషన్ జర్నీ. మా జర్నీ నేను మ్యాజిక్ చేస్తున్న డేస్ నుంచి ప్రారంభమైయింది. తను చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాని అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.

హైపర్ ఆది మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి వచ్చిన వేణు అన్న బలగంతో మనందరికీ ఒక గౌరవం తీసుకొచ్చారు. ఇప్పుడు రాకేష్ చేస్తున్న ఈ సినిమా కూడా అలాంటి గౌరవం తీసుకొస్తుందని భావిస్తున్నాను. తెలుగు ప్రశ్నలు మంచి సినిమాలు ఎప్పుడొచ్చినా గొప్పగా ఆదరిస్తారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమా వచ్చిన దానికి వచ్చే అప్లాజ్ వేరే రేంజ్ లో ఉంటుంది. రాకేష్ అలాంటి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేశాడు. ఈ సినిమాలో కెసిఆర్ అనే క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ రాకింగ్ రాకేష్ కనిపించడు. ఈ సినిమా ఆడితే రాకేష్ చాలా బాగుంటాడు. తప్పకుండా అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. థాంక్యూ’ అన్నారు.

యాక్టర్ ధనరాజ్ మాట్లాడుతూ.. రాకేష్ కి సినిమా అంటే ప్యాషన్. ఇక్కడ సంపాదించింది ఇక్కడే పెట్టాలని ఉద్దేశంతో తన సినిమాని తీశాడు. అంజి దర్శకత్వంలో ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ప్రేక్షకులు ఈ సినిమాని తప్పకుండా చూసి రాకేష్ ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వారం రెండు గంటల సమయం, 200 రూపాయలు రాకేష్ కోసం ఖర్చు పెడితే తన ముందు మరెన్నో మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తాడు. ప్రేక్షకులే ఈ కెసిఆర్ సినిమాకి దేవుళ్ళు’ అన్నారు.

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రాకేశ్ అన్న పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అన్న కోసం ఇంత దూరం వచ్చిన. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు

యాక్టర్ శివ బాలాజీ మాట్లాడుతూ.. రాకేష్ కంగ్రాజులేషన్స్. ఇంతమంది ఒక వేడుకకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది రాకేష్ మంచితనం. సినిమా మేకింగ్, కాన్సెప్ట్ చాలా బాగుంది. అంజి సూపర్ డైరెక్టర్. కెసిఆర్ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు.

హీరో, ప్రొడ్యూసర్ రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే దానికి కారణమైన దీప ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాకి ఒక ఉద్యమ నాయకుడు పేరు పెట్టుకున్నాం. నిజంగా నా జీవితంలో ఒక ఉద్యమమే జరిగింది. ఈ సినిమా కోసం నన్ను నమ్మి నా వెంట ఉన్న రాఘవన్నకి రుణపడి ఉంటాను. చదలవాడ శ్రీనివాసరావు గారు ఈ వేడుకకు రావడమే పెద్ద సక్సెస్. రోజా గారికి ధన్యవాదాలు. మీ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను. డైరెక్టర్ అంజి గారికి థాంక్స్. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు.  ఆయనతో తప్పకుండా ఆయనతో మరో సినిమా చేస్తాను. సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి.  ప్రతి టెక్నిస్కి టెక్నీషియన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు మరో జన్మ ఇచ్చి, నీ సంతోషంలో నేను ఉంటా అని చెప్పిన మా సంతోషన్నకి థాంక్స్. మీరు చెప్పిన ప్రతి మాట నన్ను ఈ రోజు ఈ స్థానం పెట్టింది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ గా నిలిచినా నా భార్య సుజాత థాంక్యూ. తప్పకుండా అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు

డైరెక్టర్ అంజి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ అనుకున్నప్పుడే అద్భుతంగా చేస్తామని ఫిక్స్ అయ్యాం. ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే రాకేష్ తో ఒక మాట చెప్పాను. ఈ సినిమా రిలీజ్ అయిన వరకూ మరో సినిమా చేయనని మాట ఇచ్చాను. ఆ మాట నేను నిలబెట్టుకున్నాను. ఇలాంటి సినిమాని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను చాలా ఎమోషనల్ కంటెంట్  వున్న సినిమా ఇది.  ఈ సినిమాని అందరూ బలగం సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అక్కడే మేము సక్సెస్ అయ్యాం. చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి’ అన్నారు.

హీరోయిన్ అన్నన్య కృష్ణన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా మంచి సినిమా చేశాం. ఇది చాలా మంచి ప్రయత్నం. మా సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. యుద్ధంలో వీరులకు నా పాట ఆయుధంగా ఉండాలని భావిస్తాను. ఈరోజు యుద్ధం చేస్తున్న రాకేష్ కి నా పాట ఆయుధమై ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు సో మచ్’ అన్నారు. సినిమా యూనిట్ మొత్తం పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. (Story : కేసీఆర్ స్పూర్తితో వస్తున్న ‘కేశవ చంద్ర రమావత్’ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1