UA-35385725-1 UA-35385725-1

 ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’తో మెప్పించనున్న అంకిత్ కొయ్య‌

 ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’తో మెప్పించనున్న

అంకిత్ కొయ్య‌

ఇటీవ‌ల విడుద‌లైన సూప‌ర్ హిట్ అయిన ఆయ్‌, మారుతీన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం చిత్రాల్లో మెప్పించిన యంగ్ సెన్సేష‌న్ అంకిత్ కొయ్య మ‌రో స‌రికొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. Gen Z ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు మేక‌ర్స్‌. యువ న‌టుల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్‌తో ఆక‌ట్టుకుంటున్న అంకిత్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా అది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. స‌త్య ఆర్ట్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌త్య కోమ‌ల్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష తెర‌కెక్కిస్తున్నారు. గ్యాంగ్ లీడ‌ర్ ఫేమ్ శ్రియా కొంతం క‌థానాయిక‌గా న‌టిస్తుంది. టి సిరీస్ సంస్థ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకుంది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా మేక‌ర్స్ ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసేలా ఓ వీడియోను రూపొందించి విడుద‌ల చేశారు.

‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ అనే టైటిల్‌తో రానున్న ఈ Gen Z ఎంట‌ర్‌టైన‌ర్‌కు వీడియోను గ‌మ‌నిస్తే అందులో శ్రియా కొంతంకు బాయ్ ఫ్రెండ్‌గా అంకిత్ కొయ్య క‌నిపిస్తారు. అలాగే హీరోయిన్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మెయిన్ ప‌ర్స‌న్ కాకా అనే పాత్ర‌లో వెన్నెల కిషోర్‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. ‘హీ కేమ్‌, హీ కాన్‌క‌ర్డ్‌, హీ కుడ‌న్ట్ లీవ్’ అనే వాటిలోనే అంకిత్ కొయ్య ఎదుర్కొన్న ప‌రిస్థితులను వినోదాత్మ‌కంగా వివరించే ప్ర‌య‌త్నం చేశారు.

‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రంలో అంకిత్ కొయ్య‌, శ్రియా కొంతం హీరో హీరోయిన్లుగా న‌టిస్తుంటే ఇక మిగిలిన ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇంద్ర‌జ‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌శాంత్ శ‌ర్మ‌, లక్ష్మీ సుజాత‌, అశోక్ చంద్ర‌, నేహా కృష్ణ త‌దిత‌రులు న‌టించారు. మార్క్ కె.రూబిన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి కె.సోమ శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌దీప్ రాయ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Young sensation Ankith Koyya’s next Gen Z entertainer is titled “14 Days Girlfriend Intlo”

The young sensation Ankith Koyya, who impressed the audience with back-to-back blockbusters like AAY and Maruthi Nagar Subramanyam, is all set to entertain once again. The energetic actor, known for his impeccable timing, is bringing a Gen Z fun entertainer. The film’s interesting poster, released a few days back, caught everyone’s attention.

The film is bankrolled by Satya Komal under Satya Arts Entertainment and is helmed by the talented director SriHarsha. Shriya Kontham of Gang Leader fame debuting in lead role and she has some exciting project lined up. The makers began the promotional activity by announcing T-Series Official as the music partner. Today, they dropped another key update, revealing the film’s quirky title with a striking video.

This Gen Z entertainer is titled 14 Days Girlfriend Intlo, and the video introduces Ankith Koyya as the boyfriend, Shriya Kontham as the girlfriend, her family, and a special character played by everyone’s favorite kaka, Vennela Kishore. The words, “He came, He Conquered and He couldn’t leave,” explain the entertaining situation Ankith finds himself in.

With a solid cast, an entertaining setup, an interesting love story, and a Gen Z touch, 14 Days Girlfriend Intlo raises anticipation for a fun-filled entertainer. Apart from Ankith Koyya and Shriya Kontham in the lead roles, the film also stars Indraja, Vennela Kishore, Prashaant Sharma, Lakshmi Sujatha, Ashok Chandra, Neha Krishna, and others in key roles.

The film’s music is scored by Mark K Robin, while K Soma Shekar is handling the cinematography. Editing is done by Pradeep Roy. More details about the film will be announced soon. (Story :  ‘14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’తో మెప్పించనున్న అంకిత్ కొయ్య‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1