Home వార్తలు సీనియర్ చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ కు ప్రతిష్టాత్మక “డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు”

సీనియర్ చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ కు ప్రతిష్టాత్మక “డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు”

0

సీనియర్ చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ కు ప్రతిష్టాత్మక “డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు”

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : గుంటూరు డాక్టర్ పట్టాభి సీతారామయ్య కళాపీఠం వారు నవరత్నాల పేరిట ప్రతియేటా ఆయా రంగాల్లో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్న వారికి అందించే
డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు ఈయేడు
నలభై ఏళ్లుగా చిత్రకళారంగంలో రాణిస్తూ.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పురస్కారాలు అందుకున్న చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ కు ప్రకటించారు. వైద్యరంగంలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ జి.సమరం, తదితర రంగాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులతో ఈ అవార్డును ఈ నెల 24 న గుంటూరు లో జరగబోయే కార్యక్రమంలో అందుకోనున్నారు. ఈ విషయాన్ని డాక్టర్ పట్టాభి కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ ఇన్విటేషన్ లో తెలిపారు. ఈ సందర్భంగా వినుకొండ రాజకీయ ప్రముఖులు, లాయర్లు,కవులు, రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు, పాస్టర్లు, చిత్రకారులు,
డా. జెస్టిస్ ను అభినందించారు. మరెన్నో అవార్డులు రివార్డులు సాధించి వినుకొండ సీమ పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేయాలని అభిలాష వ్యక్తం చేశారు. (Story : సీనియర్ చిత్రకారుడు డా. వజ్రగిరి జెస్టిస్ కు ప్రతిష్టాత్మక “డాక్టర్ పట్టాభి సీతారామయ్య అవార్డు”)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version