పేదలకు ఇల్లు ఇవ్వాలి :సీపీఐ ఆందోళన
న్యూస్ తెలుగు / వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ లో ఉన్న ఐదో వార్డు సచివాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు స్థలం వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో మూడు కిలోమీటర్లు లోపల ఇవ్వాలని. సొంత స్థలం కలిగి ఉన్నవారికి ఎన్టీఆర్ గృహ కల్పం కింద 5 లక్షల రూపాయలు డబ్బులు ఒక టన్ను స్టీలు, 100 కట్టలు సిమెంటు, ఒక లారీ ఇసుకను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి ఆదుకోవాలని, గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఇచ్చిన ఇంటి స్థలాన్ని ఒక సెంటును రద్దుచేసి రెండు సెంట్లు ఇవ్వాలని వెంటనే టిడిపి ప్రభుత్వంలో గతంలో మొదలుపెట్టి 80% పూర్తయిన టిట్కో గృహాలను వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అనేక డిమాండ్లపై సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రజలకు వివరించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి కొండ్రముట్ల సుభాని, వినుకొండ పట్టణ సహాయ కార్యదర్శి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ కమిటీ మెంబర్లు. నర్రా వెంకటరత్నం, సువార్త తోట నరసింహారావు, నరసింహ నాయక్, వల్లెపు నాగయ్య, బొట్టు శీను, తిమ్మర్తి రాంబాబు, అంజమ్మ, గాలెమ్మ, మహిళా నాయకురాలు బర్మా లక్ష్మి బాజీ మరియు వందలాదిమంది లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : పేదలకు ఇల్లు ఇవ్వాలి :సీపీఐ ఆందోళన)