UA-35385725-1 UA-35385725-1

 ‘భైరవం’ నుంచి  రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఫస్ట్ లుక్ 

 ‘భైరవం’ నుంచి  రాకింగ్ స్టార్

మనోజ్ మంచు ఫస్ట్ లుక్ 

దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’ బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి గజపతి వర్మగా రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు, ఇది సోషల్ మీడియా, ఫిల్మ్ సర్కిల్‌లలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం రాకింగ్ స్టార్ మనోజ్ మంచు బిగ్ స్క్రీన్ పై పవర్ ఫుల్ రిటర్న్ ని సూచిస్తోంది.

పోస్టర్‌లో, రాకింగ్ స్టార్ మనోజ్ మంచు గజపతి వర్మగా ఫెరోషియస్, రగ్గడ్  అవతార్‌లో కనిపించారు. పవర్ ఫుల్, ఇంటెన్స్ లుక్, బోల్డ్ ఫిజిక్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టారు. ఈ పోస్టర్ క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. స్టైలింగ్ రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఇంతకు ముందు చూడని పాత్రలో కనిపించబోతున్నారు.

ప్రతి రివీల్‌తో భైరవం చుట్టూ ఉన్న ఉత్సాహం పెరుగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్,  నారా రోహిత్ లుక్ పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి.  ఇప్పుడు, రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పోస్టర్‌తో, అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ప్రతి పాత్ర లేయర్డ్, రివర్టింగ్ స్టోరీలైన్‌ని సూచిస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ ఇయర్ బిగినింగ్ లో మనోజ్ మంచు మిరాయ్ టీజర్‌తో సంచలనం సృష్టించారు, మిరాయ్ లో”ది బ్లాక్ స్వోర్డ్”గా అదరగొట్టారు. భైరవం గజపతి వర్మ పాత్రలో అతనిని తెలుగు సినిమాలో తన రూట్స్ లోకి తీసుకువస్తుంది. ఈ పాత్ర రాకింగ్ స్టార్ మనోజ్ మంచు డెడికేషన్ ని ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా వుంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ అంచనాలను సెట్ చేసింది. మనోజ్ మంచు బోల్డ్ విజువల్, గ్రిటీ ఫీల్ డ్రామా, ఇంటెన్సిటీతో నిండిన కథను సూచిస్తుంది. భైరవంతో, రాకింగ్ స్టార్ మనోజ్ మంచు తన మార్క్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తోంది.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: KK రాధామోహన్
సమర్పణ: డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story :  ‘భైరవం’ నుంచి  రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఫస్ట్ లుక్ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1