మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే పూర్తి చేయాలి
ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్ర రెడ్డి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మునిసిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే పూర్తి చేయాలని,ప్రభుత్వం చేపట్టిన పురపాలక, నగరపాలక ఉపాధ్యాయుల పదోన్నతులు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల చేత ఇప్పటికే ప్రకటించిన పురపాలక ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిన నేపథ్యంలో తిరిగి ఆ పక్రియను వెంటనే పూర్తి చేసి పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని, ఉపాధ్యాయలకు చెల్లించాల్సిన డి ఎ, సంపాదిత సెలవులు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, 30 శాతము ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులపై బోధనేతర భారం తగ్గించాలని, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని వారు తెలిపారు. పట్టణ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, జగదీష్ మాట్లాడుతూ అపార్ గడువు పొడగించి ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలని, జీవో 117 ను రద్దుచేసి పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జెన్నె నాగప్ప ఉపాధ్యాయులు బషీర్ అహమ్మద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే పూర్తి చేయాలి )