రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎన్ డి ఏ కూటమి నాయకులు
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా); పట్టణంలోని గాంధీ నగర్ రైల్వే స్టేషన్ పోయే దారిలో రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు ఉండడంతో ప్రజలు వాహనదారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆకస్మికంగా ఆ బ్రిడ్జి యొక్క తీరును ఎన్డీఏ కూటమి నాయకులు పరిశీలించారు. ఘటనా స్థలాన్ని వారు పరిశీలించిన అనంతరం అక్కడ చేయవలసిన మరమత్తుల విషయముపై రైల్వేతోపాటు మున్సిపల్ అధికారులు దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని నాయకుడు తెలిపారు. నిత్యం నీరు ఉండడంతో చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతున్న విషయాన్ని తాము గమనించడం జరిగిందని, శాశ్వత పరిష్కారాన్ని చేపడుతామని వారు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా వేగవంతంగా పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు సుధాకర్, ఆరోగ్యశాఖ మంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. (Story : రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎన్ డి ఏ కూటమి నాయకులు)