Homeటాప్‌స్టోరీజనవరి 3, 2025న  'కల్కి 2898 AD' జపాన్‌లో రిలీజ్  

జనవరి 3, 2025న  ‘కల్కి 2898 AD’ జపాన్‌లో రిలీజ్  

జనవరి 3, 2025న  ‘కల్కి 2898 AD’ జపాన్‌లో రిలీజ్  

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా :  ప్రభాస్ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ జనవరి 3, 2025న జపాన్‌లో షోగాట్సు ఫెస్టివల్ కి విడుదల కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న ‘కల్కి 2898 AD’ గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలుకుతోంది.

వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898 AD” ఇప్పటికే స్టార్స్‌లో తన స్థానాన్ని పొందింది, ప్రపంచవ్యాప్తంగా ₹ 1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద ₹ 300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్ గా భైరవ( ప్రభాస్ ) భారతీయ ఇతిహాసం’మహాభారతం’ నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. పౌరాణిక వైభవాన్ని భవిష్యత్ తో బ్లెండ్ చేసిన కథనంలో సుమతిగా దీపికా పదుకొణె నటించారు. కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్‌గా కల్కి తో ఫేస్ అఫ్ కి సిద్ధంగా వున్నారు.

ఫ్యూచర్ వార్స్, మరోప్రపంచపు సాంకేతికత, పౌరాణికాల స్ఫూర్తితో ‘కల్కి 2898 AD’ లార్జర్ దెన్ లైఫ్ మూవీగా ప్రేక్షకులుని అలరిచింది. పురాణాలు, ఫ్యూచరిజంకు ఆవాసమైన జపాన్ లో  ‘కల్కి 2898 AD’ సందడి చేయబోటింది. ప్రభాస్ జపనీస్ ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందారు, వీరిలో చాలా మంది ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియాకి వచ్చారు.

‘కల్కి 2898 AD’ జపాన్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నందున, ప్రేక్షకులు నిజంగా “అవుట్ అఫ్ థిస్ వరల్డ్ ” ఎక్స్ పీరియన్స్ ని ఆశించవచ్చు, ఇది భారతీయ పురాణాలు, లెగసీ, టైం లెస్ హీరోయిజం ని అందిస్తోంది.

నేషనల్ అవార్డ్ విన్నర్  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD జపాన్‌లో జనవరి 3, 2025న విడుదలవుతోంది. ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ ఫ్యూచర్ ని పౌరాణికలతో బ్లెండ్ చేస్తూ మహా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. (Story :జనవరి 3, 2025న  ‘కల్కి 2898 AD’ జపాన్‌లో రిలీజ్  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics