చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు మృతి
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని చెరువులో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్నేహితులతో కలిసి లుక్మాన్ (14) ఈతకు వెళ్లారు. అనంతరం కొంతసేపు చెరువు వద్ద ఉండి, ఆ తర్వాత లుక్మాన్ ప్రమాదవశాత్తు జారిపడి చెరువులో పడిపోయాడు. గమనించిన స్నేహితులు వెతకడం జరిగింది. కానీ ఫలితం లేకపోయింది. చివరకు వన్ టౌన్ పోలీసులకు సాయంత్రం 6:45 కు సమాచారం ఇచ్చారు. దీంతో వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తో పాటు, డీఎస్పీ శ్రీనివాసులు, ఎన్డీఏ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి తదితరులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఫైర్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెతకడం జరిగింది. తదుపరి ఎట్టకేలకు కష్టపడి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మృతుడు తండ్రి ఫయాజ్, తల్లి యాస్మిన్ . కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి ఫయాజ్ కాగితాల వీధిలో కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.(Story:చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు మృతి)