వేంకటేశ్వరస్వామి చల్లని చూపుతోనే రాష్ట్రానికి మంచిరోజులు
వినుకొండలో శ్రీవారి కల్యాణోత్సవం, పుష్పయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆ వెంకటేశ్వరస్వామి చల్లని చూపుతోనే రాష్ట్రం దుష్టశక్తులు, శని ప్రభావాల నుంచి తప్పించుకు ని తిరిగి అభివృద్ధిపథంలో పరుగులు తీయగలుగుతోందని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆ వెంకటేశ్వరస్వామి అండతో వినుకొండ నియోజకవర్గం, పల్నా డు జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వినుకొండ ప్రాంతాన్ని సుఖసంతోషాలతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలన్నదే తన కోరికన్నారు. శనివారం వినుకొండ శ్రీనివాసనగర్‌లోని శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం, పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం, పుష్పయాగం నిర్వహించారు. పలు రకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ. దేవుడు ఎప్పుడూ మంచివైపే ఉంటారన్నారు. అందరికీ ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. తిరుమల తరహాలోనే వినుకొండలోనూ మూడేళ్లుగా పుష్పాభిషేకం నిర్వహిస్తున్నారని, అది చాలా సంతోషకరమైన విషయం అన్నారు. తమ నియోజవర్గం, పల్నాడు జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి ఆ వెంకటేశ్వరస్వామి తన కు ఇంకా శక్తినివ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ సహకారంతో మరింతగా నిధులు, అవకాశాలు సాధించుకుని ముందుకు వెళదామన్నారు. త్వరలోనే తిరమల తిరుపతి దేవస్థానం సహకారంతో రూ.3 కోట్ల వ్యయంతో వినుకొండ కొత్త కల్యాణ మండపం కట్టుకోబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేశారని, ఆరు నెలల్లో నిర్మాణం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకుడు నిశ్శంకర శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : వేంకటేశ్వరస్వామి చల్లని చూపుతోనే రాష్ట్రానికి మంచిరోజులు)