UA-35385725-1 UA-35385725-1

నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్య 

నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్య 

‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా న్యూస్ :   స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.  ఈ రోజు ‘కంగువ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ – ‘కంగువ’ ప్రీ రిలీజ్ కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నేను డైలాగ్స్ తో పాటు మూడు పాటలు రాశాను. స్క్రీన్ మీద సూర్య గారితో పాటు నా పేరు చూసుకుని హ్యాపీగా ఫీలయ్యాను. ‘కంగువ’లో సీన్స్ అద్భుతంగా ఉంటాయి. గొప్ప విజన్ తో ఇలాంటి సినిమా చేసినందుకు డైరెక్టర్  శివగారికి హ్యాట్సాఫ్. ఈ నెల 14న ‘కంగువ’ను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

డీవోపీ వెట్రి పళనిస్వామి మాట్లాడుతూ – ‘కంగువ’ సినిమాకు ముందు డైరెక్టర్ శివ నేను కలిసి కొన్ని మూవీస్ కు వర్క్ చేశాం. రాజమౌళి గారు ఔటాఫ్ ది బాక్స్ మూవీస్ తో సౌత్ సినిమాను వరల్డ్ స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. ఆయన ఇన్సిపిరేషన్ తో మేము ‘కంగువ’ అటెంప్ట్ చేశాం. టెక్నికల్ గా సుపీరియర్ గా ఈ సినిమా ఉండేలా జాగ్రత్త పడ్డాం. మంచి థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా ‘కంగువ’ ఉంటుందని చెప్పగలను. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – ‘కంగువ’ను ప్రొడ్యూస్ చేస్తున్న స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ గారికి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ గారికి కంగ్రాట్స్. ‘కంగువ’ పాటలు, ప్రోమోస్, వాళ్లు క్రియేట్ చేసిన వరల్డ్ చూస్తున్నాం. ఇది తమిళ సినిమానే కాదు తెలుగులో కూడా మోస్ట్ అవేటెడ్ ఫిలిం. డైరెక్టర్ శివ గారు కమర్షియల్ సినిమాలు చేయడంలో ప్రతిభావంతులు. తెలుగులో కూడా మంచి హిట్ సినిమాలు చేశారు. గ్రాండ్ గా రిలీజ్ కు రాబోతున్న ‘కంగువ’ పెద్ద సక్సెస్ కావాలని, సూర్య గారితో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ అభినేష్ మాట్లాడుతూ – సూర్య గారికి నేను పెద్ద అభిమానిని. స్టార్ గా ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ ఎంతో ఇన్స్ పైరింగ్ గా ఉంటుంది. ‘కంగువ’ సినిమాను తమిళ్ తో పాటు ఏపీలోనూ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సంతోషంగా ఉంది.  ఈ సినిమా తమిళ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. మీ అందరి సపోర్ట్ తో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి మాట్లాడుతూ – ‘కంగువ’ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. మా సంస్థకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది అవుతుందని నమ్ముతున్నాం. సూర్య గారి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి చాలా రోజులవుతోంది. ‘కంగువ’తో ఆయనకు బిగ్ థియేట్రికల్ సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూఛిబొట్ల మాట్లాడుతూ –  ‘కంగువ’ విజువల్స్ జ్ఞానవేల్ గారు చూపించారు. ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. సూర్య గారు ఏఎంబీ మాల్ కు వచ్చినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘కంగువ’ ప్రమోషన్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా భారీ స్పందన వస్తోంది. సినిమా కూడా ఇలాగే పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ – తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లాలని నాకు ఇన్సిపిరేషన్ కల్గించిన హీరో సూర్య. గజినీ టైమ్ లో సూర్య తన సినిమాలను తెలుగులో ప్రమోట్ చేసుకోవడం, తెలుగు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడానికి చేసిన ప్రయత్నాన్ని కేస్ స్టడీగా నా ప్రొడ్యూసర్స్, హీరోలకు చెబుతుండేవాడిని. తెలుగు ప్రజల ప్రేమను సూర్య ఎలా పొందాడో, మనం కూడా తమిళ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజల ప్రేమను పొందాలని చెబుతుండేవాడిని. నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. సూర్య నేను గతంలో ఓ సినిమా చేయాలనుకున్నాం. కుదరలేదు. సూర్య ఒక ఫంక్షన్ లో చెప్పాడు అతను నాతో సినిమా చేయడాన్ని మిస్ అయ్యానని, కానీ సూర్యతో సినిమా చేసే అవకాశం నేను మిస్ అయ్యాను. సూర్య నటన, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. సూర్య ఫిలింమేకర్స్ కంటే స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుని జర్నీ చేస్తున్నాడు. అతని డెసిషన్ ను గౌరవిస్తాను. ఒక సినిమాను గొప్ప లొకేషన్ కు వెళ్లి షూట్ చేయడం కష్టం. క్రూ అంతా అక్కడికి తీసుకెళ్లాలి. పెద్ద స్టూడియోలో షూటింగ్ చేయడం కూడా కష్టమే. కానీ కంగువ సినిమాను చాలా రేర్ లొకేషన్స్ లో సెట్స్ వేసి మరీ షూట్ చేశారు. మీరు పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. మీ టీమ్ కష్టమంతా సినిమా రిలీజ్ అయ్యాక విజయం రూపంలో ప్రతిఫలంగా దక్కుతుందని నమ్ముతున్నాను. కంగువ లాంటి సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ పొందుతారు.  ఈనెల 14న కంగువను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ – సూర్య ప్రొడ్యూస్ చేసిన సత్యం సుందరం సినిమాను మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆ సినిమాతో మాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాదిలో మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్ సత్యం సుందరం డిస్ట్రిబ్యూట్ చేయడం.  కంగువ విజువల్స్, కంటెంట్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. సూర్యకు ఈ సినిమా ఘన విజయాన్ని అందించాలి. డైరెక్టర్ శివ నాకు చాలాకాలంగా పరిచయం. అతనికి అతని టీమ్ అందరికీ కంగువ సక్సెస్ ను ఇవ్వాలి. అన్నారు.

నిర్మాత  అల్లు అరవింద్ మాట్లాడుతూ – కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ సందడి చూస్తుంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఉంది. గజినీ సినిమా టైమ్ నుంచి సూర్యతో మా అనుబంధం కొనసాగుతోంది. ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాం, ఇప్పటికీ ప్లాన్స్ లో ఉన్నాం. అగరం ఫౌండేషన్ తో ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సూర్య. ఆయన మనసు చాలా మంచిది. సూర్యతో పాటు ఈ టీమ్ అందరికీ కంగువ సినిమా ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ శివ మాట్లాడుతూ – తెలుగు చిత్ర పరిశ్రమతో నాకు ఎంతో అనుబంధం ఉంది. దర్శకుడిగా ఇక్కడే నాకు మంచి గుర్తింపు దక్కింది. కంగువ సినిమా గురించి చెప్పాలంటే ఇదొక విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ రా అండ్ రస్టిక్ గా జెన్యూన్ గా రూపొందించాం. కంగువ తప్పకుండా ఒక గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. నా విజన్ ను నమ్మి ప్రొడ్యూస్ చేసిన జ్ఞానవేల్ గారికి, తన సంగీతంతో సినిమాను మరో మెట్టు ఎక్కించిన దేవి శ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్. ఫస్ట్ కాపీ  చూసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది. లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ ను తెలుగు ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. మనమంతా ఈ నెల 14న థియేటర్స్ లో కంగువను సెలబ్రేట్ చేసుకుందాం. అన్నారు.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ – ఈ రోజు మా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రాజమౌళి గారికి, సురేష్ బాబు, అల్లు అరవింద్ గారు, బోయపాటి శ్రీను గారు,  సిద్ధు, విశ్వక్ ..ఇలా ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరంతా మా మూవీకి బ్లెస్సింగ్స్ అందించడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 14న రిలీజ్ కు వస్తోంది. ఈ వండర్ ఫుల్ మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ – సూర్య గారు కంప్లీట్ యాక్టర్. ఆయన ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లేకుండా సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి మూవీ చేయగలరు. రక్తచరిత్ర లాంటి సినిమాతో మెప్పించగలరు.  సూర్య గారిని మీలాగే నేనూ ప్రేమిస్తా. ఎంత క్యూట్ గా ఉంటారో అంత బాగా పర్ ఫార్మ్ చేస్తారు. సూర్య గారి మీద మన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న కంగువ పెద్ద సక్సెస్ కావాలని సూర్య గారితో పాటు ఎంటైర్ టీమ్ ను విష్ చేస్తున్నా. అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ – సూర్య గారు మంచితనం, వినయం చూస్తుంటే ఎంత గొప్పగా ఎదిగినా ఒదిగి ఉండాలని చెబుతుంటుంది. ఆయన ఎన్నో ఏళ్లుగా మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా, మా దగ్గరే ఉన్నట్లు భావిస్తాం. కంగువతో మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ను అలరించబోతున్నారు సూర్య గారు. ఆయనతో పాటు మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ – సూర్య గారు ప్రతి తెలుగింటి కుటుంబ సభ్యుడు అయ్యారు. ఆయన చేసిన ప్రతి సినిమా స్ట్రైట్ తెలుగు సినిమానే. ఈరోజు భాషా బేధాలు సినిమాకు లేవు. సూర్య గారు నటిస్తే ఆ క్యారెక్టర్ పండుతుంది. ఇలాంటి సినిమా చేసేందుకు అభిరుచి గల ప్రొడ్యూసర్ కావాలి. జ్ఞానవేల్ గారికి ఆ టేస్ట్ ఉంది. మేకింగ్ చూస్తుంటే శివ గారు ఎంత శ్రమించారో తెలుస్తుంది. ఈ సీజన్ లో వచ్చిన మన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ నెల 14న రిలీజ్ అయ్యే కంగువతో కొత్త సీజన్ మొదలుకావాలి. ప్రతి తెలుగు సినిమా గెలవాలి. ఆల్ ది బెస్ట్ టు కంగువ టీమ్. అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ – ఈ రోజు మా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన రాజమౌళి గారికి, సురేష్ బాబు, అల్లు అరవింద్ గారు, బోయపాటి శ్రీను గారు,  సిద్ధు, విశ్వక్ ..ఇలా ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ పెద్దలంతా తమ బిజీ షెడ్యూల్స్ లో మాకోసం టైమ్ కేటాయించి మమ్మల్ని బ్లెస్ చేయడం సంతోషంగా ఉంది. రాజమౌళి గారు మా అందరికీ ఒక గొప్ప దారి చూపించారు. మేము ఆ దారిలో ప్రయాణిస్తున్నాం. రాజమౌళి గారి ఏ సినిమాతో మా కంగువను పోల్చలేము. ఆయనను ఆయన సినిమాలను చూసి ఇన్స్ పైర్ అవుతుంటాం. నేను ఒకసారి రాజమౌళి గారితో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్నాను. కానీ ఇప్పటికీ ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నాను. మన కుటుంబంలో పెద్ద అన్న సక్సెస్ అయితే మిగతా వారికి ఆ స్ఫూర్తి అందుతుంది. అలా రాజమౌళి గారు సాధించిన విజయాలతో మేము స్ఫూర్తి పొందాం.  జ్ఞానవేల్ రాజా ఫోన్ లో రాజమౌళి గారి ఫొటో స్క్రీన్ సేవర్ గా ఉంటుంది. ఆయనకు రాజమౌళి గారి బ్లెస్సింగ్స్ ఉండాలి. నా దర్శక నిర్మాతలు, అభిమానులు, సినిమాను ప్రేమించే ప్రేక్షకుల వల్లే ఈ వేదిక మీద ఉండగలిగాను. కంగువ నాకు మర్చిపోలేని అనుభూతి ఇచ్చిన సినిమా. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డా. నా స్నేహితులు ప్రభాస్, రానా, అనుష్కను బాహుబలి గురించి మాట్లాడేప్పుడు రెండేళ్లు ఎలా డేట్స్ ఇచ్చారని అడిగేవాడిని. ప్రతిరోజూ ఎగ్జైటింగ్ గా వర్క్ చేశాం. రాజమౌళి గారి వల్ల ఆ ఎంకరేజ్ మెంట్ వచ్చేది అని చెప్పారు. కంగువ సెట్ లో శివ వర్క్ చూసి నాకూ అలాంటి ఎంకరేజ్ మెంట్ దక్కింది. ప్రతిరోజూ మూడు వేల మంది సెట్ లో పనిచేసేవారు. ముగ్గురు నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్స్ తో శివ వీళ్లందరితో వర్క్ చేయించుకునేవారు. కంగువలో నటించాక నేను వ్యక్తిగతంగా మరింత పరిణితి చెందాను. కంగువ వంటి స్పెషల్ మూవీ మాకు ఇచ్చినందుకు శివకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇది ఎవర్ గ్రీన్ సినిమాగా మీ మనసుల్లో నిలిచిపోతుందని నమ్ముతున్నాను. కంగువలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఈ నెల 14న థియేటర్స్ లో మరో దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం. మీ ఆశీస్సులు, ప్రేమ ఎల్లప్పుడూ కావాలి. అన్నారు.

నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ (Story : నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్య )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1