రీఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించి..పరిధిలోని సమస్యను పరిష్కరించండి..
జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రీ ఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి ఉంచి చట్ట పరిధిలో సమస్యను పరిష్కరించవలెనని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధర్మవరం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలోని సమావేశం మందిరంలో పలు రెవెన్యూ అంశాలపై, సాగు నీటి సంఘాల ఎన్నికలపై, ఓటర్ల జాబితా సవరణపై, కోర్టు కేసులు, ఈ ఆఫీస్, గ్రామసభలు, పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ధర్మవరం డివిజన్ అధికారి మహేష్, డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్లు, ఎమ్మార్వోలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల నందు, స్వీకరించిన దరఖాస్తులు పురోగతి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారికంగా ఆదేశించారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతలు సకాలంలో పరిష్కరించవలనని తెలిపారు. నాటినుండి నిర్వహించబోవు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమనందు తప్పనిసరిగా ప్రజల నుంచి వచ్చిన వినతులను రిజిస్టర్ నందు నమోదు చేయాలని తెలిపారు. దరఖాస్తుదారుడు కోరిన సమస్యకు అనుగుణంగా ఎండార్స్మెంట్ స్పీకింగ్ ఆర్డర్ కచ్చితంగా దరఖాస్తుదారులకు అందజేయాలి అని తెలిపారు. జిల్లాలో 46 వినియోగ సంఘాలకు సంబంధించి ఓటర్లు జాబితా తయారీ, పోలీస్ స్టేషన్ గుర్తింపు, ప్రచురణ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. (Story : రీఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించి..పరిధిలోని సమస్యను పరిష్కరించండి..)