Homeవార్తలు “భైరవం” నుంచి నారా రోహిత్ ఫెరోషియస్ ఫస్ట్ లుక్

 “భైరవం” నుంచి నారా రోహిత్ ఫెరోషియస్ ఫస్ట్ లుక్

 “భైరవం” నుంచి నారా రోహిత్ ఫెరోషియస్ ఫస్ట్ లుక్

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా న్యూస్ :   బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ అద్భుతమైన స్పందనతో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. రోజు, మేకర్స్ నారా రోహిత్ ఫెరోషియస్ అవతార్ ని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో రోహిత్ యాక్షన్-ప్యాక్డ్ గా కనిపించారు. ఈ సినిమాలో అతని పాత్ర ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతుందో ఫస్ట్ లుక్ తో అర్థం చేసుకోవచ్చు. ఈ యాక్షన్ పార్ట్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది.

నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న మూవీలో ప్రముఖ తారాగణం, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. మనోజ్ మంచు ఫస్ట్ లుక్ త్వరలో రివీల్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ స్క్రీన్‌ను షేర్ చేసుకోడం సినీ అభిమానులకు కన్నుల పండగలా వుండబోతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: KK రాధామోహన్
సమర్పణ: డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story :  “భైరవం” నుంచి నారా రోహిత్ ఫెరోషియస్ ఫస్ట్ లుక్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!