ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం
నవంబర్ 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపైన్ డేస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 1-1-2025 నాటికి 18 ఏళ్ళు నిండే యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా, కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే వారికోసం, మరియు మార్పులు, అభ్యంతరాల కోసం నవంబర్ 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపైన్ డేస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపైన్ లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు తమ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునే వారు స్థానిక బూత్ లెవెల్ అధికారిని సంప్రదించి ఫారం-6 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 29 న విడుదల చేసిన ఓటర్ ముసాయిదా లో అభ్యంతరాల కోసం ఫారం – 7, సవరణలకు ఫారం – 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తూ చేసుకోవచన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైటు ద్వారా కూడా దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపారు. (Story : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం )