సిపిఐ నాయకులు మోటుపల్లి యోగేశ్వరరావు మృతి
సిపిఐ నేతలు ఘన నివాళులు
న్యూస్ తెలుగు/వినుకొండ : గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతు గురువారం రాత్రి మరణించిన మోటుపల్లి యోగేశ్వరరావు (68) అకాల మరణానికి చింతిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ వినుకొండ నియోజకవర్గ కమిటీ వారు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. అజాతశత్రువు అందరికీ మిత్రుడు మృదుస్వభావి అమరుడైన కామ్రేడ్ యోగేశ్వరరావు తన తండ్రి కమ్యూనిస్టు అయినందున ఆయన ఆశయాలను ఆచరిస్తూ తన కుటుంబం భార్య, ఇద్దరు అబ్బాయిలు ఒక ఆడపిల్ల అందరికీ పెళ్లిళ్లు చేసి కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకొనుచు వినుకొండ నియోజకవర్గంలో సిపిఐ నాయకుడిగా, మంచి కమ్యూనిస్టు కార్యకర్తగా, ప్రజా సేవకుడిగా ప్రజా పోరాటాలలో పాల్గొన్న మనిషిగా అనేకమంది ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా కామ్రేడ్ యోగేశ్వరరావు మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడని తెలియజేస్తు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. సంతాపాన్ని తెలియజేసి నివాళులర్పించిన వారిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా నాయకులు ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పొట్లూరు వెంకటేశ్వర్లు,కె. మల్లికార్జున రావు, చీరాల ఆంజనేయులు, చైతన్య తదితర సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతిమ సంస్కారాన్ని శుక్రవారం ఆయన స్వగ్రామం పిట్టంబండ లో నిర్వహించారు.(Story :సిపిఐ నాయకులు మోటుపల్లి యోగేశ్వరరావు మృతి)