విద్యార్థుల పట్ల పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు బాధ్యత మెలగాలి
ఎంఈఓ గోపాల్ నాయక్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పాఠశాలలోని విద్యార్థుల పట్ల పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు అందరూ కూడా ఖచ్చితంగా బాధ్యతతో మెలగాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీన ఇందిరమ్మ కాలనీలో గల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన సంఘటనపై తమ విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులతో కమిటీతో సమావేశాన్ని నిర్వహించి జరిగిన విషయంపై విచారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాలకు గేటు రెండువైపులా ఉంటే ఒకవైపు మూసివేయాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా పోలీసులు నైట్ బీట్ కూడా చేయాలని సిఐకు తెలపడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులతో రాతపూర్వకంగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. పాఠశాల యాజమాన్య కమిటీకి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, తల్లిదండ్రులు కూడా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావడం కాకూడదని చెప్పి ప్రధానోపాధ్యాయుల్ని ఆదేశించడం జరిగిందని తెలిపారు. బాలికపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని విచారణలో తేలింది అన్నారు ఈ విచారణ పట్ల పాఠశాల తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు. (Story : విద్యార్థుల పట్ల పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు బాధ్యత మెలగాలి)