ఏపీ ఆర్యవైశ్య యువజన సంఘంలో రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ గా పెనుజూరు జూరు నాగరాజు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెనుజూరు నాగరాజును రాష్ట్ర పొలిటికల్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్యుల నాయకుల యొక్క ఆశీస్సులతో తాను ఏపీ ఆర్యవైశ్య యువజన సంఘం లో రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ గా ఎంపిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య యువజన సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే విధంగా తాను పనిచేస్తానని తెలిపారు. ఆర్యవైశ్య యువజన యొక్క సమస్యలను పరిష్కరించడంలో తాను అహర్నిశలు పాటుపడతానని తెలిపారు. నన్ను చైర్మన్‌గా ఎన్నుకున్నందుకు ఏపీ ఆర్యవైశ్య మహాసభ, మాజీ మంత్రులు టీజీ వెంకటేష్‌కు, ఏపీ ఆర్యవైశ్య యువజన సంఘం శబరి వరప్రసాద్ కు, ఏపీ జిల్లాలలోని ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి వారు కర్నూల్ లోని చైర్మన్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ- మాజీ మంత్రివర్యులు అయిన టీజీ వెంకటేశును ఘనంగా సన్మానించి, ఆశీస్సులను పొందారు.ఈ సందర్భంగా ఈనెల 24వ తేదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు కేటీఆర్ కన్వెన్షన్ హాల్,గుత్తి రోడ్- అనంతపురం నందు నూతన కమిటీ ప్రమాణ స్వీకారము, అభినందన సభ నిర్వహిస్తున్నందున, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు ఇవ్వాలని వారు కోరారు. (Story : ఏపీ ఆర్యవైశ్య యువజన సంఘంలో రాష్ట్ర పొలిటికల్ చైర్మన్ గా పెనుజూరు జూరు నాగరాజు )