జాతీయ సమైక్యతా శిబిరానికి కేహెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కె. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొమండూరు ధనుష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్, జాతీయ సమైక్యత శిబిరంనకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్. కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలో ధనుష్ ను అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ధనుష్ “గుజరాత్ రాష్ట్రంలోని హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీ, పటాన్ లో ఈ నెల(నవంబర్) 8 నుంచి 14వ తేదీ వరకూ జరిగే జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొంటారని, దేశ సంస్కృతి,ఆచార, సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యకలాపాలు యువకులను,విద్యార్థులను అవగాహన అభివృద్ధి కి పాటుపడేలా భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాల మంత్రిత్వ క్రీడా శాఖ, జాతీయ సమైక్యతా శిబిరము ముఖ్య పాత్రను పోసిస్తుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డా.బి.గోపాల్ నాయక్, అధ్యాపక, అధ్యాపకేతర బృందo, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : జాతీయ సమైక్యతా శిబిరానికి కేహెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి )