ఘనంగా జరిగిన రైతు క్షేత్ర దినోత్సవ వేడుకలు
వ్యవసాయ అధికారులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని ఆకుతోటపల్లి ధర్మపురి గ్రామాలలో ఘనంగా రైతు చరిత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నట్లు ఏడిఏ,ఎంఏఓ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిసిడి సహకార మిత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గత నాలుగు నెలల నుండి రైతు పొలంబడుల ద్వారా నేర్చుకున్న అంశాలను పాల్గొన్న రైతులతోనే పంచుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రైతు సంఘం ద్వారా సమస్త వారు ఇచ్చిన సేంద్రీయ ఎరువులు వివిధ రకాల కపాయాలు బాగా పనిచేసే పెట్టుబడిలో గత సంవత్సరం కన్నా 7000 రూపాయలు ఖర్చు తగ్గించడం అయినదని తెలిపారు. అలాగే దిగుబడి కూడా ఎకరాకు 27 బస్తాలు వచ్చినట్లు ఈ పద్ధతులు పాటించిన రైతులు తెలపడం జరిగిందన్నారు. తదుపరి ఏ డి ఏ ఎం ఏ ఓ లు మాట్లాడుతూ పంటలకు సంబంధించిన సలహాలు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న గిరాకీ అధిక ధర గురించి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసిడి సిబ్బంది, ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు, టి యల్ రవి, నారాయణస్వామి, ఎఫ్ఓఐఎస్ పాల్గొనడంతో పాటు రాబోవు రబీ సీజన్లు లో సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తున్నట్టు ఉత్సాహంగా ఉన్న రైతులకు ముందుగా రావాలని వారు తెలియజేశారు. (Story : ఘనంగా జరిగిన రైతు క్షేత్ర దినోత్సవ వేడుకలు)