Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ వరద బాధితులకు బెడ్ షీట్లు పంపిణీ..

విజయవాడ వరద బాధితులకు బెడ్ షీట్లు పంపిణీ..

0

విజయవాడ వరద బాధితులకు బెడ్ షీట్లు పంపిణీ..

స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్. టీఎం. బషీర్ డాక్టర్. వై. సోనియా

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇటీవల విజయవాడలో వచ్చిన వరదకు విజయవాడ ప్రాంతవాసులు ఎంతో నష్టపోవడం జరిగింది. ఈ సంఘటన చాలా బాధ వేయడంతో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సాయి నగర్ లో గల స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ టి.ఎం బషీర్, డాక్టర్ వై సోనియాలు మొదటిసారి మానవతను చాటుకున్నారు. తదుపరి రెండవసారి సోమవారం ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ జయ బాబు ఆధ్వర్యంలో విజయవాడలోని రామలింగేశ్వర నగర్ కట్ట ప్రాంతంలో వరద నీటి వలన నష్టపోయిన 1100 కుటుంబాలకు స్పందన హాస్పిటల్ తరఫున వారు బెడ్ షీట్లను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ మాస్ స్పందన హాస్పిటల్ తరఫున ప్రజలకు సేవలు అందించిన అశోక్ బాబుకు చెన్నుపాటి గాంధీ కు జయ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. మానవసేవయే మాధవసేవ అన్న స్ఫూర్తితో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాభావముతో ముందుకు వెళ్లాలని, అప్పుడే మనకు ఈ కార్యక్రమం చేయుటలో ఎంతో సంతృప్తి, సంతోషం లభిస్తుందని తెలిపారు. (Story : విజయవాడ వరద బాధితులకు బెడ్ షీట్లు పంపిణీ.. )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version