రాత్రి సమయంలో తరగతులు నిర్వహణ సరికాదు..
అదనపు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి.
ప్రగతిశీల విద్యార్థి సంఘం(పి ఎస్ యు) ధర్మవరం పట్టణ అధ్యక్షులు నందకిషోర్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : అదనపు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరి దేవి కువినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నందకిషోర్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రాత్రి 7:30 గంటల అయినప్పటికీ తరగతులు నిర్వహిస్తున్నారు అని విద్యార్థికి రెస్టు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.ఈ విధంగా తరగతులు నిర్వహించడం వలన ఉదయం నుండి సాయంకాలం వరకు ఏకతాటిగా తరగతులు విద్యార్థులు చదువుకోవడం వలన మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. ఈ విధంగా ఇబ్బందిపడి గతంలో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలో జిల్లాలో చోటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా ప్రైవేట్ పాఠశాల వారు వారి పాఠశాల వారి లబ్ధి, మార్కులు ర్యాంకులు రావాలన్న తలంపుతో యాజమాన్యం, విద్యార్థులను ఈ విధంగా సమయం పాటించకుండా రాత్రి సమయాల్లో తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులకు అనేక ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది అని తెలిపారు.అందువలన ఇలాంటి అదనపు తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాల వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో ఆ పాఠశాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు నాగ సాయి, నాని, కార్తీక్,శ్రీశాంత్,సునీల్ తదితరులు పాల్గొన్నారు. (Story : రాత్రి సమయంలో తరగతులు నిర్వహణ సరికాదు..)