జగన్ విధ్వంసం చేసిన చోటనే కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి వెలుగులు
రహదారిపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ, మక్కెన
న్యూస్తెలుగు/ వినుకొండ : మొన్నటి వరకు జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి చిరునామా కాగా.. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధికి చిరునామాగా ముందుకెళ్తోందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఐదేళ్లు అప్పులు, అరాచకాలతో వార్తల్లో నిలిచిన రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. రోడ్ల మరమ్మతులకు రూ.826 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఏపీ కార్యక్రమంలో భాగంగా శనివారం ఈపూరు మండలం కొండ్రముట్లలో గుంతల పూడ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి రహదారిపై ఉన్న గుంతలు పూడ్చారు. (Story : జగన్ విధ్వంసం చేసిన చోటనే కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి వెలుగులు)