ఈ నెల 5న నరసరావుపేట లో జరిగే రైతు కార్మిక సంఘాల జాత జయప్రదం చెయ్యండి
ఉలవలపూడి రాము
న్యూస్‌తెలుగు/నరసరావుపేట : ఢిల్లీ రైతు ఉద్యమం జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించు జాత కార్యక్రమం 5వ తేదీ నరసరావుపేట కి రానున్నది రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాత లో పాల్గొనే నాయకులకు ఆహ్వానం పలుకుదాం రండి కదలిరండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రామ శనివారం నరసరావుపేటలోని భవన్ నారాయణ భవనంలో అఖిలపక్ష రైతు సంఘాలు కార్మిక సంఘాల సమన్వయ సమితి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఢిల్లీలో వ్యవసాయ మూడునల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి ఈనెల 26వ తేదీకి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలో ఈ ఉద్యమం అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఒక జాత నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 5వ తేదీన ఈ జాత మన పల్నాడు జిల్లా నరసరావుపేట కి రానున్నది ఈ జాతాలో పెద్దలు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ గారు అలాగే అనేక మంది రైతు కార్మిక సంఘ పెద్దలు ఈ జాతాలు పాల్గొనడం జరుగుతుందని వారిని మన జిల్లా నుండి ఘనంగా స్వాగతం పలకాలని ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని నిలబెట్టుకోకపోక రైతులకు నష్టం జరిగే చట్టాలను రైతుల మీద రుద్దాలను చూస్తుందని ఎన్నో ఏళ్లుగా డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయమని రైతు సంఘాలు గగ్గోలు పెట్టినప్పటికీ పట్టించుకునే నాధుడే లేడని వీటన్నిటి పైన ఈ జాత ద్వారా రైతు కార్మిక లను చైతన్యం చేయటం కొరకే రాష్ట్రవ్యాప్తంగా ఈ జాత నిర్వహించడం జరుగుతుందని అనంతరం ఈనెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలను ర్యాలీలను నిర్వహించాలని దీని ద్వారా రైతులకు కార్మికులకు ప్రజలకు చైతన్య వచ్చే విధంగా చేయటమే లక్ష్యమని ఈ సందర్భంగా రాము మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ ఏపూరి గోపాలరావు వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్ హుస్సేన్ ఈ సమావేశాన్ని ఉధేశించి మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో ఉప్పలపాటి రంగయ్య, సత్యనారాయణ రాజు, ఏఐటియుసి నరసరావుపేట కార్యదర్శి వైదన వెంకట్ హర్ష, షేక్ చిన్న, జాన్ సైదా, తదితర రైతు కార్మిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story ; ఈ నెల 5న నరసరావుపేట లో జరిగే రైతు కార్మిక సంఘాల జాత జయప్రదం చెయ్యండి)