Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జాతీయ సీనియర్ హాకీ పోటీలకు ఎంపికైన ధర్మవరం క్రీడాకారులు

జాతీయ సీనియర్ హాకీ పోటీలకు ఎంపికైన ధర్మవరం క్రీడాకారులు

0

జాతీయ సీనియర్ హాకీ పోటీలకు ఎంపికైన ధర్మవరం క్రీడాకారులు

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) ; హాకీ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 4వతేదీ నుండి 16వ తేదీ వరకు చెన్నైలో జరుగనున్న 14వ పురుషుల జాతీయ సీనియర్ హాకీ పోటీలలో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం క్రీడాకారులు హరీష్, వెంకటేష్ నాయక్, రాజేష్ ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బందనాథం సూర్యప్రకాష్ తెలియజేశారు.జూన్ నెలలో ధర్మవరంలో జరిగిన 14వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల టోర్నమెంట్లో శ్రీ సత్యసాయి జిల్లా హాకీ జట్టు రెండవ స్థానం సాధించడం జరిగినది. అందులో ప్రతిభ కనబరిచి న ముగ్గురు క్రీడాకారులు రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించారు.అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజట్టు కు కోచ్ గా శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాప్రాధికార సంస్థ హాకీ కోచ్ ధర్మవరం కు చెందిన ఎస్. హస్సేన్వ్య వహరించనున్నారు.. ఎంపికైన క్రీడాకారులకు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ,బంధనాతం సూర్య ప్రకాష్, హాకీ సత్యసాయి జిల్లా గౌరవాధ్యక్షులు. బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్ , హాకీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు బీ.వీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, ఉడుముల రామచంద్ర,గౌరీ ప్రసాద్ , మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న,జాయింట్ సెక్రెటరీ అరవింద్ గౌడ్, చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతి, ఇర్షాద్ , సీనియర్ క్రీడాకారులు ఊకా రాఘవేంద్ర, అమునుద్దీన్ , కిరణ్ అభినందనలు తెలియజేశారు. (Story : జాతీయ సీనియర్ హాకీ పోటీలకు ఎంపికైన ధర్మవరం క్రీడాకారులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version