Homeవార్తలుతెలంగాణ2న బీసీ కమిషన్ సభ్యులు ఉమ్మడి జిల్లా హనుమకొండ కు రాక

2న బీసీ కమిషన్ సభ్యులు ఉమ్మడి జిల్లా హనుమకొండ కు రాక

2న బీసీ కమిషన్ సభ్యులు ఉమ్మడి జిల్లా హనుమకొండ కు రాక

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : స్థానిక సంస్థల రిజర్వేషన్ల కల్పనపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నవంబర్ 2వ తేదీన హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం రానున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. బుదవారం ప్రకటనలో తెలిపారు.
ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి పాల్గొననున్నట్లు తెలిపారు. నవంబర్ 2న ఉదయం 10 నుంచి ఉమ్మడి హనుమకొండ జిల్లాలైన వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి మహబూబాబాద్, జనగామ జిల్లాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారని వివరించారు.ములుగు జిల్లాలోని అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆసక్తి కలిగిన ప్రతినిధులు వారి వారి కులాలలో ఉన్నటువంటి సమస్యలు రాజకీయపరమైన, సామాజికపరమైన, ఆర్థికపరమైన అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను, తమ అభిప్రాయాలను, విజ్ఞప్తులను కమిషన్ బృందానికి సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటన లో కోరారు.
(Story:2న బీసీ కమిషన్ సభ్యులు ఉమ్మడి జిల్లా హనుమకొండ కు రాక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!