అంతర రాష్టాల సరిహద్దుల చెక్కు పోస్ట్లను తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ రాంపతి
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : వాజేడు మండలంలోని పేరూరు గ్రామంలో గల అంతర్రాష్ట్ర, సతీస్ ఘడ్, ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బి.రాంపతి వాజేడు మండలం తాసిల్దార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ పోలీస్ శాఖల నుండి నియమించబడిన సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరి దాన్యం కు సంబంధించిన వాహనాలను నిరంతరం తనిఖీ చేయాలని,సరైన పత్రాలు ఉంటేనే అనుమతించాలని, లేనిచో అట్టి వాహనాలను సీజ్ చేసి వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే సీఎంర్ బియ్యము, పిడి ఎస్ బియ్యం వాహనాలను తనిఖీ చేసి, వెంటనే జప్తు చేయాలనీ ఆదేశించారు. పిడిఎస్ బియ్యం, రాక పోకల వాహనాలను వెంటనే సీజ్ చేయాలనీ ఆదేశించారు. అదేవిధంగా చెక్ పోస్ట్ లో వాహనాలు రాకపోకల సమాచారాన్ని, ఒక రిజిస్టర్లో నమోదు చేసి జిల్లా పౌరసరఫరాల అధికారికి నిరంతరం సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.(Story:అంతర రాష్టాల సరిహద్దుల చెక్కు పోస్ట్లను తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ రాంపతి)