అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో ఖాదర్బాషా భార్య షేక్ నూర్జహాన్ (38) అనారోగ్యంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాల పై విచారణ చేయడం జరిగిందన్నారు. భర్త ఖాదర్ బాషా మూడు సంవత్సరాల కిందట మృతి చెందాడని తెలిపారు. మృతురాలు షేక్ నూర్జహాన్ రేషన్ పని కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. గత కొన్ని నెలలుగా మృతురాలు నూర్జహాన్ కు అనారోగ్యం రావడంతో, ఇంట్లోని ఓ గదిలో ఉరివేసుకొని మృతి చెందిందని తెలిపారు. మృతురాలకు 18 సంవత్సరాల సేక్షావలి, 9 సంవత్సరాల శశావళి కలరని తెలిపారు. వీరు కూడా ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు. తదుపరి మృతురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సవ పరిక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. (Story : అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య)

