అటవీ భూములపై ఆగడాలు
న్యూస్ తెలుగు /చాట్రాయి : చీపురుగూడెం గ్రామంలో ఎస్సీల భూములపై అటవీ భూములపై రోజురోజుకు బొట్టు లక్ష్మణరావు ఆగడాలు పెచ్చ రెల్లిపోతున్నాయని ….నేను అధికార పార్టీ ….మంత్రికి నేను ఎంతచెప్తే అంత ……. అటవీ భూమి నాకు ఎప్పుడో ఆన్లైన్ అయింది…. నా దగ్గర భూమి రికార్డులు ఉన్నాయి… అంటూ మమ్ములను బెదిరిస్తూ మేము విత్తనాలు పెట్టించిన మొక్కజొన్న చేను మొత్తం దున్నిచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన వైనమిది. చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామం అత్యధిక శాతం ఎస్సీలు, బీసీలకు నిలయమైన గ్రామం ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పూర్వం రోజుల నుండి ఎస్సీ బీసీ కుటుంబాల వారు అడవి కొట్టుకుని సాగు చేసుకుంటున్న భూములను పోవడానికి ఆక్రమించుకోవడానికి ఒక పథకం ప్రకారం బీద కుటుంబాల వారిని భయపెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు మంత్రి సారధి గారు చీపురుగూడెం లో పెద్ద మీటింగ్ పెట్టి ఎస్సీ ,బీసీలకు , పెద్ద పాలేరు లా పని చేస్తానని పెత్తందారీ విధానం భూస్వామి జమీందారీ విధానాలు ఇక సాగనివ్వనని తొలిసారి మా గ్రామంలో హామీ ఇవ్వడంతో తామంతా నమ్మి ఓట్లు వేశామన్నారు. బీసీ నాయకుడుని గెలిపించుకున్నామన్నారు. ఈరోజు అనగా బుధవారం ఉదయం గ్రామంలోని ఆర్ఎస్ నెంబర్ 645లో సుమారు 25 సంవత్సరాల నుండి ఎస్సీ సామాజిక తరగతి కుటుంబాల వారు అటవీ భూమి సాగు చేసుకుని జీవిస్తున్న భూమిలో శ్రీకాంత్, భీమయ్యలు దుక్కి దున్నించి బోదెలు తోలించి నుంచి విత్తనాలు పెట్టిన భూములు బొట్టు లక్ష్మణరావు తన కొడుకుని ట్రాక్టర్ ఇచ్చి పంపించి విత్తనాలు పెట్టిన భూమిని దౌర్జన్య పూర్వకంగా దున్నిచారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణరావు ఆగడాలను అడ్డుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. (Story : అటవీ భూములపై ఆగడాలు)