గీతాంజలి స్కూల్స్ నందు ప్రారంభమైన దీపావళి వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ టి. కృష్ణవేణి ముఖ్య అతిధిగా పాల్గొని చిన్నారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను నిర్వహిస్తారని కాబట్టి విద్యార్థులందరూ తమలోని చెడుని విసర్జించి మంచి అలవాటులను అలవర్చుకొని జాతి గర్వించే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగజేయాలని ఈ దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ గీసిన రంగవల్లులు చూపరులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైయల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి స్కూల్స్ నందు ప్రారంభమైన దీపావళి వేడుకలు)