స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలి
ఎమ్మెల్యే జీవీ
న్యూస్తెలుగు/ వినుకొండ : మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు . మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా ) ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే జీవి సందర్శించి మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలు, వస్త్రాలు, ఫ్యాన్సీ వస్తువులు, బొమ్మలు, ఆహార పదార్థాలను పరిశీలించి స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, మెప్మా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. (Story : స్వయం సహాయక సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలి)