రైస్ మిలర్ల గోదాంలను తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ రాంపతి
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) ; గోవిందరావుపేట, తాడ్వాయిలో గల రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా జిల్లా రైస్ మిలర్ల ద్వారా అనుమతించి నిల్వ ఉంచిన బియ్యం గోదాములను పౌరసరఫరాల సంస్థ, ములుగు జిల్లా మేనేజర్ బి.రాంపతి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బఫర్ గోదాంలలో ఉంచిన బియ్యం నిలువలు ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్ఎ క్యూ ప్రమాణాలకు లోబడి మాత్రమే ఉన్నాయని తెలిపారు. గోదాము అధికారులకు, టెక్నికల్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. రైస్ మిల్లర్ల నుంచి మిలింగ్ చేసి కష్టం మిలింగ్ క్రింద వచ్చిన బియ్యాన్ని, వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించి మాత్రమే తీసుకోవాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అదేవిధంగా గోవిందరావుపేట, పస్రా పరిధిలోని పలు రేషన్ షాపులను తనిఖీ చేశారు. అక్కడ కూడా బఫర్ గోదాముల నుంచి వచ్చిన బియ్యం చాలా బాగున్నాయని, బలవర్ధక మైన బియ్యం వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రేషన్ షాపుకు వచ్చిన రేషన్ కార్డు దారులతో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాన్యత ఎలా ఉన్నాయని అడగగా, కార్డు దారులు రేషన్ షాపుల ద్వారా ప్రస్తుత ప్రభుత్వము ఏర్పాటు అయిన తర్వాత సరఫరా అవుతున్న బియ్యం మంచి నాన్యత ప్రమాణాలతో, మంచి పోషకాలు కలిగిన బలవర్ధకమైన బియ్యం సరఫరా అవుతున్నాయని, ప్రతినెలా రేషన్ షాపుల నుండి తీసుకొని తింటున్నామని, చాలా రుచికరంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. (Story : రైస్ మిలర్ల గోదాంలను తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ రాంపతి)