టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి
రిటైర్డ్ అందత్వ నివారణ అధికారి డాక్టర్. ఎస్. నరసింహులు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య జిల్లా) : దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చినప్పుడు కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలను పాటించి, దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని రిటైర్డ్ అందత్వ నివారణ అధికారి డా. ఎస్. నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బిఐ కాలనీలో గల మధు కన్ను అండ్ వృద్ధుల వైద్యశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు టపాసులు కాల్చేతప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వారు వివరించారు. తొలుత ధర్మవరం పట్టణము, గ్రామ ప్రజలకు వారు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున బాణాసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, తీసుకోకపోతే ముఖానికి గాయాలు, కంటికి గాయాలు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. కంటిలోని నల్ల గుడ్డుకు గాయం కాకుండా చూసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఒక్కోసారి బాణ సంచాలు పేలేటప్పుడు ఎవరికైనా కను గ్రుడ్డి పై తగిలితే కనుక్రుడ్డు పగిలిపోవడంతో పాటు కంటి చూపులు పూర్తిగా కోల్పోతారని తెలిపారు. ప్రతి ఇంటి ముందర పిల్లలు గానీ, యువతి యువకులు గాని బాణాసంచా కాల్చేటప్పుడు కుటుంబ సభ్యులు దగ్గరుండాలని తెలిపారు. కావున ప్రజలందరూ పై విషయాలను గమనించి ప్రమాదాలు లేకుండా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని వారు కోరారు. (Story : టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి)