Home వార్తలు ప్రొడక్షన్ నెం 58 డబ్బింగ్ ప్రారంభం

ప్రొడక్షన్ నెం 58 డబ్బింగ్ ప్రారంభం

0

ప్రొడక్షన్ నెం 58 డబ్బింగ్ ప్రారంభం

న్యూస్ తెలుగు/ హైదరాబాద్ సినిమా:  విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ #VenkyAnil03 షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయింది.

తాజాగా టీమ్ డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన డిలైట్ ఫుల్ వీడియో వేడుక వాతావరణాన్ని చూపిస్తోంది, వెంకటేష్‌ని అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్,  కుటుంబంతో పాటు అందరూ ఉత్సాహంగా కనిపించారు. వెంకటేష్ చరిష్మా, రావిపూడి హ్యుమర్ తో ఈ మూవీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

#VenkyAnil03 సంక్రాంతికి 2025లో విడుదల కానుంది.

నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో- రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story : ప్రొడక్షన్ నెం 58 డబ్బింగ్ ప్రారంభం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version