దీపావళి పండుగ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ సభ్యులకు
నిత్యవసర సరుకులు పంపిణీ
ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకుడు డోలా రాజారెడ్డి.
న్యూస్ తెలుగు /ధర్మవరం(శ్రీ సత్య సాయి జిల్లా) :
పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయం నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) యూనియన్ సభ్యులకు దీపావళి పండగ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు దీపావళి శుభాకాంక్షలతో నిత్యవసర సరుకులు పంపిణీ ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు, బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి పంపిణీ చేశారు.అనంతరం హరీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తివంతమైనటువంటి జర్నలిజం లో ఉన్నటువంటి అందరికీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తరఫున మీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థగా ఉన్నటువంటి జర్నలిజం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, సమాజ హితం కోరి, సమాజంలో సామాజిక చైతన్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చిరు కానుకగా దీపావళి పండుగకు ఇవ్వాలని భావించడం జరిగింది అని అందుకే రెండు రోజులు ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ అత్యంత క్రియాశీలకంగా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చిన మారుమూల గ్రామాల్లో సైతం మీ వానిని బానిని వినిపిస్తూ ప్రపంచానికి జరుగుతున్న వార్తలను విషయాలను తెలియజేస్తూ అత్యంత గొప్ప జర్నలిజానికి మారుపేరుగా మీరు ఉంటున్నందుకు ధర్మవరం నియోజకవర్గం ప్రజల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ధర్మవరం నియోజకవర్గం లో ఎటువంటి సమస్యలు లేకుండా సమస్యల లేని రహిత నియోజకవర్గం గా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేయడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తరపున మిమ్మల్ని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు. (Story : దీపావళి పండుగ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ సభ్యులకు
నిత్యవసర సరుకులు పంపిణీ)